సారావళి online....
ఈ సారావళి గ్రంథము, బృహజ్జాతకము కంటే ఫల విషయంలో విశేష ఉపయోగము ఉన్నది. బృహజ్జాతకములో వరాహమిహిరాచార్యుల పద్ధతులు మునులచే చెప్పబడిన జ్యోతిషశాస్త్ర గ్రంథములలోని విషయములకు విరుద్ధముగ ఉన్నట్లు తెలియుచున్నది. ప్రాచీనజ్యోతిషశాస్త్ర గ్రంథములు రచించిన అత్రి, పరాశర, గర్గ, భరద్వాజ, వసిష్ఠ, యవన, శక్తి, విశ్వామిత్ర, గుడాగ్ని, కేశ, పౌలిశ, రోమశాదులచే రచింపబడిన జ్యోతిషశాస్త్ర గ్రంథములలోని నిస్సారవిషయములను వదలి సార విషయములను మాత్రమే గ్రహించి, కళ్యాణవర్మ
ఈ 'సారావళి' అను గ్రంథము రచించెను.